30 మంది విద్యార్థులను వాతలు వచ్చేలా కొట్టిన పీడీ..! 11 h ago
TG: స్టడీ అవర్‌కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను పీడీ వాతలు వచ్చేలా కొట్టాడు. సిద్దిపేట - కొండపాక మండలంలోని గురుకుల పాఠశాలలో స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ వాసు కర్రతో చితకబాదాడు. ఒళ్లంతా వాతలు రావడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు పాఠశాలకు చేరుకొని ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.